AP: తిరుమల లడ్డూ వివాదం పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ పిటిషన్లపై మధ్యాహ్నం 3:30 గంటలకు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. సీఎం చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ నిజానిజాలు తేల్చాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి, దీనిపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరపాలని టీటీడీ మాజీ ఛైర్మన్ సుబ్బారెడ్డి పిటిషన్లు వేశారు.