భార్య గర్భవతిగా ఉన్నప్పుడు తప్పనిసరిగా భర్త కొన్ని ఆచారాలను పాటించాలని పురోహితులు చెబుతున్నారు. అవి ఏమిటంటే.. భార్య కోరిన కోరికలు తీర్చాలి. అలాగే భార్య సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందట. అలాగే కట్టెలు కొట్టడం కానీ చెట్లను నరకడం కానీ చేయకూడదట. భార్య గర్భవతి అయిన నాటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు కటింగ్, షేవింగ్ చేయించుకోకూడదట. ఇంకా మృతదేహాన్ని మోయడం.. శవం వెంట నడవడం వంటివి కూడా చేయకూడదు.