AP: అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం పోర్టులకు 3వ నంబర్ హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలో అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు ఆదివారం వరకు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మరోవైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడనుంది. రాబోయే 12 గంటల్లో ఉత్తర దిశగా అల్పపీడనం కదలనుంది.