హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ACB తనపై కేసు నమోదు చేయడంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ కేసును క్వాష్ చేయాలని కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ జస్టిస్ క్రవణ్ కుమార్ బెంచ్ ముందు విచారణకు రానుంది. మధ్యాహ్న భోజనం తర్వాత ఈ పిటిషన్‌పై విచారణ జరిగే ఛాన్స్ ఉంది. కాగా, ఈ కేసులో కేటీఆర్‌ను ఏసీబీ A-1 నిందితుడిగా పేర్కొన్న విషయం తెలిసిందే.