కొడుకుకి వినూత్నంగా పేరు పెట్టిన తండ్రి

50చూసినవారు
కొడుకుకి వినూత్నంగా పేరు పెట్టిన తండ్రి
ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన సీహెచ్ రాఘవేంద్ర తన కొడుకుకి వినూత్నంగా పేరు పెట్టారు. కులం, మత ప్రస్తావన లేకుండా ‘సీహెచ్ వన్‌ టూ సిక్స్’ అని నామకరణం చేశారు. ఆధార్, బర్త్ సర్టిఫికేట్‌, ఇతర ధ్రువపత్రాల్లోనూ ఇదే పేరు నమోదు చేయించారు. అయితే ‘సీహెచ్ వన్‌ టూ సిక్స్’ అంటే అర్థం ఏంటో తెలుసా? వన్ అంటే I, టూ అంటే AM, సిక్స్ అంటే INDIAN.. ఐయామ్ ఇండియన్ అని అర్థం వచ్చేలా పేరు పెట్టినట్లు తండ్రి సీహెచ్ రాఘవేంద్ర పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్