నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం తుది దశకు చేరుకున్నది. ఇవాళ ఆ విమానాశ్రయంలో విజయవంతంగా ట్రయల్ ల్యాండింగ్ నిర్వహించారు. భారతీయ వైమానిక దళానికి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్.. ఆ విమానాశ్రయం రన్‌వేపై దిగింది. వచ్చే ఏడాది ఈ కొత్త విమానాశ్రయం అందుబాటులోకి రానున్నది. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ295 విమానం ఇవాళ రన్‌వేపై ల్యాండ్ అయ్యింది. ఈ సందర్భంగా ఆ విమానం వాటర్ సెల్యూట్ చేశారు.