విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం జరిగిన 12 గంటలలో రెస్క్యూ ఆపరేషన్ పూర్తైంది. మృతదేహాలు, గాయపడిన వారిని తరలించారు. ఆ తర్వాత ఉదయం 9 గంటల నుంచి ట్రాక్ పునరుద్ధరణ పనులు, విద్యుత్ సరఫరా పనులు కొనసాగాయి.
బాహుబలి క్రేన్‌ని తెచ్చి పట్టాలపై పడిన బోగీలను తొలగించారు. ప్రస్తుతం ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. సాయంత్రానికి ట్రయల్ రన్ పూర్తి చేయాలనుకుంటున్నారు. ఇదేజరిగితే ఇవాళ రాత్రి నుంచే రైళ్ల రాకపోకలు సాగుతాయి.