సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం విజయవాడ ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన మాట్లాడుతూ.. ‘గత ఏడాది ఇదే రోజు ఏ ఆధారం లేకుండా నన్ను అక్రమ కేసులో అరెస్ట్ చేశారు. ఆ రోజు ప్రజలంతా నా వెంట నిలిచారు. నా పట్ల అంత ఆదరణ చూపిన ప్రజల కోసం జీవితం అంకితం చేసి పని చేస్తాను. నన్ను ఏ పేరుతో పిలిచినా పలుకుతూ వారి మధ్యే ఉంటాను. ఇవాళ ప్రజలకు కష్టం వస్తే వారి మధ్యలోనే ఉన్నాను.’ అని అన్నారు.