జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీలకర్రను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే అ నీటిని తాగడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్‌తో బాధపడేవారు ఈ నీటిని తీసుకుంటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే కొవ్వు కరుగుతుంది. దీంతో బరువు తగ్గుతారు. ఈ నీరు శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా అజీర్తి, గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుంది.