AP: గత వైసీపీ ప్రభుత్వంలోని ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన నివేదికను స్వతంత్ర సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీకి సమర్పించింది. అందులో గ్రామీణ ప్రాంతాలను వైసీపీ పూర్తిగా విస్మరించిందని, మూలధన వ్యయం చేయలేదని తెలిపింది. దీంతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పడలేదని స్పష్టంచేసింది. ఆ రెండు కారణాల వల్లే ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.