హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)కు చెందిన ఆరుగురు క్రికెటర్లపై సస్పెన్షన్ వేటు పడింది. వయసు నిబంధనలను అతిక్రమిస్తూ టోర్నీల్లో ఆడినట్లు పోలీసుల విచారణలో తేలింది. నివేదిక ఆధారంగా బీసీసీఐ ఆరుగురు ప్లేయర్లపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 4 నుంచి నవంబర్ 3, 2026 వరకు సస్పెన్షన్ కొనసాగనుంది. సస్పెన్షన్కు గురైన వారిలో సాయిచంద్ర, ప్రేమ్, అనుదీప్, దివేశ్, ఆదిత్య, చిరాగ్ ఉన్నారు.