ఏపీలో వైఎస్ జగన్ వర్సెస్ షర్మిల వార్ కొనసాగుతుంది. ఆస్తి వివాదాలపై వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. 'కన్నతల్లిపై కేసు పెట్టిన దౌర్భాగ్యుడు ఎవరైనా ఉన్నారా? ప్రతి ఇంట్లో ఉండేదే అని అంత సులభంగా ఎలా అంటారు?. మీకు మానవత్వం లేదా? మీకు ఎమోషన్స్ లేవా? అని జగన్ను షర్మిల సూటిగా ప్రశ్నించారు.