వైసీపీ మాజీ ఎంపీ బుధవారం సీఐడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కోటరీ వల్లే జగన్‌కు దూరమైనట్లు తెలిపారు. కోటరీ మాటలు వినొద్దని జగన్ చెప్పిన వినకపోవడంతోనే వైసీపీ నుంచి బయటికి వచ్చానన్నారు. జగన్ కోర్టు కేసు నుంచి బయటపడితేనే మళ్లీ రాజకీయ భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. అలాగే తాను మళ్లీ వైసీపీలో చేరడం జరగదన్నారు.