ఏసీలో పాములు.. షాకింగ్ వీడియో

80చూసినవారు
AP: విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లోని ఏసీలో పాము పిల్లలు పెట్టింది. అది గమనించిన ఆయన స్నేక్ క్యాచర్ కిరణ్‌కు సమాచారమిచ్చారు. ఆయన వచ్చి ఏసీలో ఉన్న పాము పిల్లలను బయటికి తీశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. వేసవి కాలం వచ్చేసింది. ఇన్నాళ్లూ ఆఫ్‌లో ఉన్న ఏసీలను ఆన్ చేస్తున్నారు. ముందు జాగ్రత్తతో ఒకసారి మీరూ ఏసీలను క్లీన్ చేయించండి.