ఆపదలో చిక్కుకున్న మహిళలు ‘శక్తి’ యాప్ ఓపెన్ చేసి అందులోని SOS ఆప్షన్‌పై నొక్కితే, వెంటనే 10 సెకన్ల నిడివిగల వీడియో, ఆడియో ఆటోమేటిక్‌గా రికార్డై ఘటనా స్థలం లొకేషన్‌తో సహా పోలీసు కంట్రోల్ రూమ్‌కు వెళ్లిపోతుంది. దీంతో బాధితురాలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో పోలీసులకు అర్థమవుతుంది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి రక్షిస్తారు. ‘హ్యాండ్ గెస్చర్’ అనే ఆప్షన్ ఆన్ చేస్తే ఫోన్ అటూ ఇటూ ఊపినా సమాచారం చేరుతుంది.