విశాఖ రుషికొండపై వైఎస్ జగన్ నిర్మించిన భవనాలు ఐకానిక్ అని సీఎం చంద్రబాబే ప్రశంసించారని వైసీపీ ట్వీట్ చేసింది. జగన్ హయాంలో రూ.412 కోట్లతో నిర్మించిన 7 ప్రభుత్వ భవనాలు ఏపీకి ఐకానిక్ అని చంద్రబాబే ఒప్పుకున్నారని వైసీపీ పేర్కొంది. చంద్రబాబు హయాంలో అమరావతిలో రూ.700 కోట్లతో తాత్కాలిక భవనాలు నిర్మించారని, అవి చిన్నపాటి వర్షానికే లీక్ అయ్యాయని వైసీపీ విమర్శించింది. రుషికొండ భవనాలను చూపించినట్లే.. అమరావతి భవనాలనూ చూపిస్తే బాగుంటుందని పేర్కొంది.