AP: విద్యుత్ ఒప్పందాలు పొందడానికి గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా ఆరుగురు నిందితులు భారత్ అధికారులకు లంచాలు ఇచ్చారని యూఎస్ ప్రాసిక్యూటర్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో వైఎస్ జగన్ కూడా ఆరోపణలు ఎదురుకుంటున్నారు. జగన్ ఏకంగా రూ.1750 కోట్ల లంచాలు డైరెక్ట్‌గా తీసుకున్నారని, ఆధారాలు సైతం ఉన్నాయని ఎఫ్బీఐ చెబుతోంది. నేరం రుజువైతే అదానీతో పాటు జగన్‌కు కూడా జైలుకు వెళ్లక తప్పదని రాజకీయ నిపుణులు అంటున్నారు.