సీఎం ఎంపికపై వారిదే తుది నిర్ణయం: ఏక్‌నాథ్‌ షిండే

64చూసినవారు
సీఎం ఎంపికపై వారిదే తుది నిర్ణయం: ఏక్‌నాథ్‌ షిండే
మహారాష్ట్ర సీఎం ఎంపిక, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలతే తుది నిర్ణయమని, వారు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే అన్నారు. మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనేదానిపై సందిగ్ధత కొనసాగుతున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహాయుతికి చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టిన మహారాష్ట్ర ఓటర్లకు మరోసారి ధన్యవాదాలు తెలిపారు. తన దృష్టిలో సీఎం అంటే కామన్‌ మ్యాన్‌ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్