ఏపీ మాజీ సీఎం జగన్ మరోసారి అలర్ట్ అయ్యారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేసి అధికార కూటమిలోకి వెళ్లటంతో జగన్ అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయా జిల్లాల్లో వైసీపీ పరిస్థితి ఎలా ఉంది..? కీలక నేతలు ఎవరైనా పార్టీకి దూరంగా ఉంటున్నారా..? లడ్డూ వివాదం కార్యకర్తలపై ఏ మేరకు ప్రభావం చూపుతుంది..? అనే విషయాలను ఆయన ఆరా తీసినట్లు సమాచారం.