ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీకి అత్యంత కీలకమైన నాయకుడు, బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యాన్ స్విచ్ ఆపేయబోతున్నారా అంటే ఆ విధంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జోగి రమేష్ వైఎస్సార్ కుటుంబానికి వీర విధేయుడు. అయితే ఇప్పుడు ఆయన టీడీపీలో చేరబోతున్నారనే వార్త తెగ వైరల్ అవుతోంది. మొన్నటివరకు జనసేనలో చేరునున్నారనే పుకారు వినిపించింది. మరీ ఈ వార్తలపై జోగి రమేష్ మౌనంగా ఉండటంతో వాటికి మరింత బలం చేకూరుతోంది.