అతడి మృతితో.. కుటుంభంలో విషాదం
అట్లూరు మండలంలోని కొండూరు బీసీ కాలనీకి చెందిన బత్తల రమణయ్య (45) భాక రాపేట సమీపంలో ప్రమాదవశాత్తు రైలు కింద పడి మృతి చెందారు. మృతుడు పనులకు తిరుపతి ప్రాంతానికి వెళ్లాలని శుక్రవారం తెల్లవారుజామున వెళ్లగా..అప్పటినుంచి ఎటువంటి సమాచారం లేదు.. కాగా మృతుడి జేబులో దొరికిన ఫోన్ నెంబర్ కు కాల్ చేసి తెలుపగా కుటుంభికులు అక్కడికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసారు.