చిలుకూరు అర్చకుడిపై దాడి కేసు.. వీరరాఘవరెడ్డికి పోలీస్‌ కస్టడీ

80చూసినవారు
చిలుకూరు అర్చకుడిపై దాడి కేసు.. వీరరాఘవరెడ్డికి పోలీస్‌ కస్టడీ
TG: చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు సీఎస్‌ రంగరాజన్‌పై దాడి కేసులో నిందితుడు వీరరాఘవరెడ్డికి కోర్టు మూడు రోజుల పోలీస్‌ కస్టడీ విధిస్తూ సోమవారం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని రాజేంద్రనగర్‌ కోర్టులో పోలీసులు పిటిషన్‌ వేయగా.. రేపటి నుంచి మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. వీరరాఘవరెడ్డిని పోలీస్‌కస్టడీకి ఇవ్వద్దని అతడి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

సంబంధిత పోస్ట్