గుజరాత్‌లోని సూరత్ నగరం లాల్ దర్వాజా సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఊహించని ప్రమాదం జరిగింది. బైక్‌పై దంపతులు వెళ్తుండగా ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. రెప్పపాటులో బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై నుంచి దంపతులు కింద పడి గాయాలపాలయ్యారు. ప్రమాదం తర్వాత కారు డ్రైవర్ వేగంగా అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన దంపతులను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.