ఎర్రగుంట్ల మండలంలోని నాలుగు రోడ్లలో శుక్రవారం ఉదయం ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడి శరీరంలోని సగభాగం నుజ్జు నుజ్జు అయ్యింది. గాయపడిన వ్యక్తిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. క్షతగాత్రుడిని రిటైర్డ్ ఉద్యోగి రామచంద్రారెడ్డి (70)గా గుర్తించారు.