వేంపల్లెలో ప్రియుడి ఇంటి ముందు యువతి ధర్నా

62చూసినవారు
తనని ప్రేమించి, పెళ్లి చేసుకొని మోసం చేశాడని ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకి దిగిన ఘటన వేంపల్లెలో జరిగింది. శనివారం బాధితురాలు వివరాల
ప్రకారం. యువతి వేంపల్లెకు చెందిన గురుతో 6 ఏళ్ల నుంచి ప్రేమించుకుని ఇటీవల పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ తర్వాత ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదని ఆమె మీడియా ఎదుట వాపోయింది. సీఐ సురేశ్ రెడ్డి అక్కడికి చేరుకొని ఇరువురిని పోలీసుస్టేషన్ కు తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్