ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. సోమవారం రాయచోటి మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి మాట్లాడుతూ జిల్లాలో ఏ ఒక్కరు సమస్యలతో బాధపడకూడదనే ఉద్దేశంతో ప్రజాదర్బార్ నిర్వహించి అనేక సమస్యలు పరిష్కరించడం జరుగుతోందన్నారు.