Oct 24, 2024, 15:10 IST/
సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా
Oct 24, 2024, 15:10 IST
సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. నవంబర్ 11న ప్రమాణస్వీకారం చేయనున్నారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ కాలం నవంబర్ 10న ముగియనున్న నేపథ్యంలో తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. దీనికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. 2025 మే 13 వరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా సీజేఐగా కొనసాగనున్నారు.