వల్లూరు: చెన్నకేశవస్వామి ఆలయంలో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం
దేవి శరన్నవరాత్రి సందర్భంగా అరోవ రోజు మంగళవారం శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వల్లూరు మండల పరిధిలోని పైడికాల్వ గ్రామంలో వెలిసిన పవిత్ర హరిహర క్షేత్రం శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు, ప్రధాన అర్చకులు హరి నారాయణ స్వామి ఆధ్వర్యంలో పూజలను నిర్వహించారు.