పారదర్శకంగా ఉచిత ఇసుక ప్రజలకు అందేలా చూడాలి: కలెక్టర్
ఉచిత ఇసుక ప్రజలకు పారదర్శకంగా అందేలా చూడాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వీరపునాయునిపల్లె మండలం అనిమేల ఇసుక క్వారీని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డితో కలిసి సందర్శించారు. ఇసుక రిచ్ వద్ద ఇసుక సరఫరాను నిలిపివేయడంతో ఎందుకు ఆపివేసారంటూ అధికారులను ప్రశ్నించారు. ఆన్లైన్ సిస్టం ద్వారా ఉచిత ఇసుక ప్రజలకు అందేలా చూడాలని ఆదేశించారు. అధికారులు, నాయకులు పాల్గొన్నారు.