వీరపునాయునిపల్లిలో రోడ్డు ప్రమాదం
కారు ద్విచక్ర వాహనం ఢీకొని భార్యాభర్తలకు గాయాలయ్యాయి. ఆదివారం వీరపునాయునిపల్లిలో ప్రమాదం చోటు చేసుకున్నది. స్థానికుల వివరాల మేరకు యర్రగుంట్ల వైపుకు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని కారు వెనుక నుంచి ఢీకొనడంతో లలితా దేవి, ఆమె భర్త ఉమామహేశ్వర్ రెడ్డికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 వాహనంలో ప్రొద్దుటూరుకు తరలించారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.