రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా తన స్వగ్రామం రాక పురష్కరించుకుని ఆదివారం పెద్దాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సామర్లకోట మండలంలోని పవర కూడలి ప్రాంతంవద్ద ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాగ్ ఆధ్వర్యలో సామర్లకోట, పెద్దాపురం నాయకులు కార్యకర్తలు గజమాల వేసి ఎంపీ సతీష్ బాబుని అభినందించారు.