

సామర్లకోట: చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చినరాజప్ప
పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆదివారం సామర్లకోటలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పేదల ఆరోగ్య భద్రత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎనలేని కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చినరాజప్ప తెలిపారు. తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షులు అడబాల కుమారస్వామి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బడుగు శ్రీకాంత్, నిమ్మకాయల కిరణ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.