అల్లవరం మండలంలోని బోడసకుర్రు గ్రామంలో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో బాధితుల కోసం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను పునరావాస కేంద్రంగా ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో కృష్ణమోహన్ తెలిపారు. పునరావాస కేంద్రం వద్ద శానిటేషన్ పనులను గురువారం పరిశీలించారు. ప్రజలకు వసతి కల్పించడంతోపాటు, భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.