అంబాజీపేట హైస్కూల్ వద్ద హెలిపాడ్ నిర్మాణం

584చూసినవారు
అంబాజీపేట హైస్కూల్ వద్ద హెలిపాడ్ నిర్మాణం
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 11వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంబాజీపేటలో పర్యటించనున్నారు. ఇక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొనేందుకు ఇద్దరు నేతలు హెలికాఫ్టర్ పై రానున్నారు. వీరి పర్యటన కోసం పి. గన్నవరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో అంబాజీపేట హైస్కూల్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్