మామిడికుదురు మండలం పాసర్లపూడికి చెందిన యోగా గురువు నారాయణను ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ కు ఎంపిక చేసింది. ఈ నెల 28న దక్షిణ భారతదేశంలో యూనివర్సిటీ నిర్వహించే కాన్వకేషన్లో డాక్టరేట్ ప్రదానం చేస్తామని నిర్వాహకులు ఆదివారం తెలిపారు. 14 ఏళ్ల నుంచి 50 దేశాలకు చెందిన 60 వేల మందికి నారాయణ యోగాలో శిక్షణ ఇచ్చారు. సినీ నటులు కాజల్, ప్రభాస్, గోపీచంద్, సమంత నారాయణ వద్ద శిక్షణ పొందారు.