ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో సోమవారం గోదాదేవి అమ్మవారు రంగనాథుల స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. సాంప్రదాయ బద్ధంగా ప్రభుత్వం తరుపున ఎమ్మెల్యే సత్యానందరావు దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులు దర్శించుకున్నారు.