
వాడపల్లి దేవస్థానంలో అభివృద్ధి పనులు ప్రారంభం
కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు సోమవారం ప్రారంభించారు. వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్మించిన అన్నదానం కోసం పునఃప్రారంభించిన భవనాన్ని, తాత్కాలిక అన్నదాన భవనంలో నిర్మించిన ఫ్లోరింగ్ ను, చలివేంద్రాన్ని అలాగే అదనపు గోశాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.