ముమ్మిడివరం మండలం అయినాపురంలో సోమవారం తృటిలో ప్రమాదం తప్పింది. బైక్ పై వెళ్తున్న వ్యక్తి అదుపు తప్పి డ్రైన్ లో బోల్తా పడి పోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు రక్షించారు. అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైన్లో పడిన బైకును బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.