వర్షాలు, వరదల కారణంగా ముంపు బారిన పడి నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే బుచ్చిబాబు తెలిపారు. అన్నంపల్లి, కొత్తలంక, పెదమెట్లంక వద్ద మునిగిన వరి నారుమళ్లు, వరి చేలను ఆదివారం ఎమ్మెల్యే పరిశీలించారు. రైతులు మురుగు కాలువలు సక్రమంగా లేక ముంపు సమస్య ఎదురవుతోందని ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. గతంలో ఇక్కడ ముంపు సమస్యను పరిష్కరించడానికి స్లూయిజ్లను ఆధునికీకరించామని, దాంతో సమస్య తప్పిందన్నారు.