సఖినేటిపల్లి మండలం అంతర్వేది సముద్ర తీరంలో శుక్రవారం పర్యాటకుల సందడి నెలకొంది. కార్తిక పౌర్ణమి సందర్భంగా పలువురు భక్తులు సముద్రంలో స్నానాలు ఆచరించి ఒడ్డున కార్తీకదీపం వెలిగించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పెద్దలు, చిన్నారు సముద్ర తీరంలో సహపంక్తి భోజనాలు చేసి సముద్రంలో స్నానాలు చేసి ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు.