రాజోలు: గుంతలు రహిత రోడ్ల నిర్మాణమే లక్ష్యం: ఎమ్మెల్యే

53చూసినవారు
గుంతలు రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. ఆయన శనివారం ఇంపాక్ట్ నిధులు రూ. 2. 60 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మామిడికుదురు గోగన్నమఠం రోడ్లు భవనాల శాఖ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వ హయాంలో అధ్వానంగా మారిన రహదారుల ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జడ్పీ మాజీ ఛైర్మన్ నామన రాంబాబు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్