తుని పట్టణంలో వివేక జూనియర్ కళాశాలలో మహిళా రక్షణ వ్యవస్థపై బుధవారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పట్టణ సీఐ గీతా రామకృష్ణ, ఎస్ఐ విజయబాబు మాట్లాడుతూ రక్షణ వ్యవస్థ గురించి, విద్యార్థి దశలో చెడు వ్యసనాలకు అలవాటు పడితే భవిష్యత్తులో ఎదుర్కోవాల్సిన దుష్పరిణామాల గురించి, సైబర్ క్రైమ్, కేవైసీ, ఫ్రాడ్, జాబ్ ఫ్రాడ్, పలు విషయాలను, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు.