
తుని: రైలు ఢీకొని సాధువు మృతి
తుని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తుని పట్టణ శివారు రైల్వే ట్రాక్ దాటుతుండగా తుని నుంచి అన్నవరం వైపు వెళ్తున్న గూడ్స్ ట్రైన్ ఢీ కొట్టడంతో గుర్తుతెలియని సాధువు మృతి చెందినట్లు జిఆర్పి ఎస్ శ్రీనివాసరావు తెలిపారు. మృతుడు ఎవరనేది తెలియరాలేదని మృతుడు(50) కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నాడన్నారు. మృతదేహాన్ని తుని ఏరియా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు ఎస్ఐ మీడియాకు తెలిపారు.