
తుని: పార్టీ విధేయులకు సంస్థాగత ఎన్నికల్లో స్థానం కల్పించాలి
టీడీపీ సంస్థాగత కమిటీల్లో అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సూచించారు. తుని నియోజకవర్గంలోని పార్టీ కమిటీల ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఆదివారం తేటగుంట క్యాంప్ కార్యాలయంలో సీనియర్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తుని, తొండంగి, కోటనందూరు మండలాల ప్రధాన కమిటీల ఏర్పాటుపై ఆయా మండలాల నేతలకు దిశానిర్దేశం చేశారు.