అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అవనిగడ్డ ఎస్సై శ్రీనివాస్ హెచ్చరించారు. అవనిగడ్డ మండలం మోదుమూడి గ్రామానికి వెళ్లే బ్రిడ్జి ఎదురుగా ఉన్న షాపుల్లో కొంతకాలంగా అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు పక్కా సమాచారంతో ఎస్ఐ శ్రీనివాస్ శుక్రవారం సాయంత్రం దాడి చేసి పట్టుకున్నారు. అక్రమంగా నిల్వ చేసిన 12 మద్యం బాటిల్ లు స్వాధీనం చేసుకుని షాపు యజమానిపై కేసు నమోదు చేశారు.