కృష్ణా జిల్లా మచిలీపట్నంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో నిజాంపేటకు చెందిన దంపతులు ఉప్పాల గోపీకృష్ణ - వాసవి సోమవారం రైలు కిందపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, భార్య మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన గోపీకృష్ణ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పెళ్లయినప్పటి నుంచి భార్యతో చిన్నచిన్న గొడవలు ఉండటంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు గోపీకృష్ణ తెలిపాడు.