మచిలీపట్నం: భద్రతకు ప్రాముఖ్యత
రహదారుల్లో ప్రయాణించే వాహనదారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు పేర్కొన్నారు. మంగళవారం మచిలీపట్నంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ట్రాఫిక్ పరికరాలను, కిట్లను నాగాయలంక ఓఎన్జిసి సంస్థ అందజేసింది. రోడ్డు భద్రతను మెరుగుపరచడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ పరికరాలు ట్రాఫిక్ సిబ్బందికి మరింత ఉపయోగకరంగా ఉంటాయాన్ని ఎస్పీ అన్నారు.