మచిలీపట్నంలో కాపు భవన్ నిర్మాణానికి హామీ ఇస్తున్నానని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం మచిలీపట్నంలో కాపు యువసేన ఆధ్వర్యంలో కాపు వనసమారాధన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కృష్ణాజిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టడానికి కృషి చేస్తానని, కాపుల అభ్యున్నతికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కాపులే కీలక పాత్ర పోషించారన్నారు.