రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి శనివారం మచిలీపట్నం మూడో డివిజన్ వరదపాలెంలో స్వచ్ఛ ఆంధ్ర. స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే ముందు మన పరిసరాలు మెరుగు పర్చుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మన ఇంటి నుండే పరిశుభ్రతకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు.