తాజాగా టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందటంతో మొన్నటివరకు క్రికెట్ వాలీబాల్ కబడ్డి ఆటలను ఎల్ఈడి స్క్రీన్ మీద చూసేవాళ్ళం. కానీ నేడు టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోవడంతో సోమవారం సంక్రాంతి పండగ సందర్భంగా కోడిపందాలను తిరువూరు నియోజకవర్గంలో ఎల్ఈడి స్క్రీన్ పై ప్రజలు వీక్షించారు. తిరువూరు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో జోరుగా కోడిపందాలు సాగాయి.